సమంత సినిమాలకు బ్రేకిచ్చింది కానీ... సినిమాలు నిర్మించడానికి కాదు. ప్రస్తుతం నటనకు కూడా బ్రేకిచ్చిన సమంత సినిమాలేవీ ఒప్పుకోకుండా కేవలం వెబ్ సీరీస్ లు మాత్రమే చేస్తుంది. ఇప్పుడా సిరీస్ కూడా ఆగిపోయింది. అయితే సమంత కొత్త అవతారమెత్తింది. నిర్మాతగా టర్న్ అయ్యింది.
శుభం అంటూ కొత్త నటులతో సినిమాని నిర్మించి సక్సెస్ అయ్యింది. దానితో నిర్మాతగా అన్ స్టాపబుల్ అంటూ మళ్ళీ మరో చిత్రాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అది కూడా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో. నందిని రెడ్డి తో కలిసి సమంత జబర్దస్త్, ఓ బేబీ చిత్రాలు చేసింది. ఇప్పుడు సమంత నందిని రెడ్డితో నిర్మించబోయే సినిమాలో ఆమె నటించబోతుంది అని సమాచారం.
అమె దగ్గర కొచ్చిన సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం హెల్త్ రీజన్స్ అని చెప్పిన సమంత ఇప్పుడు తను నిర్మించబోయే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందన్నమాట.