బాలీవుడ్ లో ఇంకా స్టార్ స్టేటస్ కోసం కష్టపడుతున్న జాన్వీ కపూర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. జాన్వీ కపూర్ గ్లామర్ రచ్చ కి సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. అంతేకాదు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉన్న జాన్వీ కపూర్ సౌత్ కి క్రేజీ హీరోయిన్ గా మారింది.
ఆచి తూచి గ్లోబల్ స్టేటస్ అందుకున్న ఎన్టీఆర్ తో దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ చిత్రానికి జాన్వీ కపూర్ కి మేకర్స్ ఐదు కోట్ల పారితోషికం ఇచ్చారట. ఇప్పుడు అమ్మడు రామ్ చరణ్ తో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి జాన్వీ కపూర్ కళ్ళు చెదిరే పారితోషికం అందుకుంటుందట.
పెద్ది చిత్రానికి గాను జాన్వీ కపూర్ కు మేకర్స్ ఆరు కోట్లు పారితోషికంగా చెల్లిస్తున్నారట. అంటే దేవరకి ఐదు అయితే పెద్ది కి మరో కోటి పెంచేసింది జాన్వీ కపూర్. హిందీలో ఎలా ఉన్నా సౌత్ లో జాన్వీ కపూర్ కి బాగానే గిట్టుబాటు అవుతోంది. ఇప్పుడు అమ్మడిని అల్లు అర్జున్-అట్లీ మూవీ లోను కన్సిడర్ చేస్తున్నారు. దీనికోసం ఎంత తీసుకుంటుందో జాన్వీ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.