కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముద్రగడ అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ముద్రగడని వెంటనే కాకినాడలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించి ఆ వేంటనే ఆయన్ని కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడని అంతకుముందు హైదరాబాద్ తరలించాలని అనుకున్నా వైద్యుల సూచనల మేరకు ముద్రగడకు కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తండ్రి పరిస్థితి తెలుసుకున్న ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి ఆయన్ని చూసేందుకు ఆసుపత్రికి రాగా.. ముద్రగడ కుమారుడు గిరి ఆమెను అడ్డుకున్నారు. ముద్రగడ కు ఆయన కుమార్తె క్రాంతికి గత కొంతకాలంగా విభేదాలున్నాయి.