సూపర్ స్టార్ మహేష్-రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB29. జనవరి లో సైలెంట్ గా మొదలైన ఈ చిత్ర అప్ డేట్ కోసం యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది. కానీ రాజమౌళి SSMB29పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ఆయన పని ఆయన చేసుకుని పోతున్నారు. SSMB29 లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి బడా స్టార్స్ భాగమైనా కానీ అఫీషియల్ అప్ డేట్ లేదు. అన్ని అనధికార వార్తలే తప్ప.
ఇక జులై లో SSMB29 చిత్ర బృందం ఆఫ్రికా వెళ్లి అక్కడ కెన్యా అడవుల్లో తదుపరి షెడ్యూల్ చెయ్యాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితులు SSMB29 షూటింగ్ కి ఇబ్బందిగా మారడంతో రాజమౌళి ప్లాన్ మార్చి మరో దేశానికీ పయనమవుతున్నారు. కెన్యాలో పలు లొకేషన్స్ ను ఫైనల్ చేసిన రాజమౌళికి అక్కడ షూటింగ్ కి అనుకూలంగా లేకపోవడంతో టైమ్ వేస్ట్ అవ్వకుండా మరో దేశంలో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు.
టాంజానియాలోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో SSMB29 షూటింగ్ నిర్వహించేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ టాంజానియా షెడ్యూల్లో మహేష్ తో పాటుగా, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటారని.. ఈ నెల చివరి వారంలోనే టీమ్ టాంజానియా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.