పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు-రాజకీయాలతో పరుగులు పెడుతున్నారు. వరస బెట్టి ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. హరి హర వీరమల్లు, OG చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడొక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంప్లీట్ అవ్వగానే అంటే సెప్టెంబరు నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి తగిన చర్యలు చేపడతారని, కూటమిలో కొనసాగుతూనే జనసేన పార్టీని బలపడే దిశగా వ్యూహాలు రచించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం తమ పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాలనుకుంటున్నారట.
జనసేనకు బలం ఉన్న 50 స్థానాలను గుర్తించి త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టడమే కాకుండా ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. మరి ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇకపై ఎలాంటి సినిమా ఒప్పుకోరని, 2029 ఎన్నికలపైనే దృష్టిపెడతారని టాక్. ఒకవేళ పవన్ ప్లాన్ అదే అయితే పవన్ చివరి సినిమా ఉస్తాద్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లేగా..