మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కలయికలో మే లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టుకున్న మెగా 157 షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతుంది. కేరళలో చిరు-హీరోయిన్ నయనతార ల నడుమ బోట్ లో అనిల్ రావిపూడి పెళ్లి సీన్ తెరకెక్కిస్తున్న సీన్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మెగా 157 లో చిరు-నయన్ మధ్యలో రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో లీకైన ఆ వీడియో ని చూసి ఖంగుతిన్న మేకర్స్ ఫైర్ అవడమే కాదు.. ఇలాంటి లీకులకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నిర్మాతలు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ సంస్థలు ఓ లేఖను విడుదల చేసాయి.
ఇక ఈ చిత్రంలో చిరు డ్రిల్ మాస్టర్ గా కనిపించబోతున్నారు, చిరు కి నయనతార భార్యగా కనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా మెగా 157 ని విడుదల చేసేలా అనిల్ రావిపూడి షూటింగ్ ని చకచకా పూర్తి చేసేస్తున్నారు.