సమంత ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు, వెబ్ సీరీస్ షూటింగ్ కూడా ఆగిపోయింది. కానీ ఎందుకో సమంత కు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ. ఆమె ఫొటోస్ షేర్ చేసినా, సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా వెంటనే వైరల్ అవుతుంది. సినిమాల్లో నటించకపోయినా ఒక హీరోయిన్ కి ఇంత క్రేజా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కారణం.. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ చేసే సర్వే లో సమంత ఎక్కువగా టాప్ లో నిలుస్తుండడమే. తాజాగా ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రివీల్ చేసింది. ఆ లిస్ట్ లో హీరోల లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. జూన్ నెల లో ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు.
ఇక హీరోయిన్స్ లిస్ట్ లో ఎన్నోసార్లు మొదటి స్థానంలో నిలిచిన సమంత జూన్ నెలకు కూడా అగ్రస్థానం కైవసం చేసుకోవడం విశేషం. కొంతకాలం నుంచి సినిమాలు చేయకపోయినా సమంత టాప్‌లో నిలవడం ఆశ్చర్యం కాక ఇంకేముంటుంది. సమంత తర్వాత బాలీవుడ్ నటి ఆలియా భట్ రెండో స్థానంలో ఉంటే.. దీపికా పదుకొణె మూడో స్థానం దక్కించుకున్నారు. అలాగే త్రిష, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి వరుసగా 4, 5, 6 స్తానాల్లో నిలిచారు.
అయితే సినిమాల్లో నటించకపోయినా సమంత ఏదో విషయంగా సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఇప్పుడు కూడా రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ ఆమెను ఎక్కువగా సెర్చ్ చెయ్యడానికి కారణమంటున్నారు.