అవును అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత నేషనల్ కాదు ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. పుష్ప ద రూల్ తో 1600కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీసుని రూల్ చేశారు. అది కూడా ఎలాంటి అంచనాలు లేకుండా పుష్ప 1 తో పాన్ ఇండియా మార్కెట్ ని షేకాడించిన అల్లు ర్జున్ పుష్ప 2 తో 1600 మార్కెట్ ని సెట్ చేసారు.
అల్లు అర్జున్ అట్లీ తో కలిసి ఇప్పుడు భారీ టార్గెట్ ని సెట్ చేస్తున్నారట. అల్లు అర్జున్-అట్లీ AA 22 అనౌన్సమెంట్ వీడియో ఎంతగా సంచలనాలు సృష్టించిందో అందరూ చూసారు. దేశం మొత్తం AA 22 గురించి మట్లాడుకునేలా చేసిన అల్లు అర్జున్, అట్లీలు ఇప్పుడు 2000 కోట్ల భారీ టార్గెట్ ను సెట్ చేయబోతున్నారట. అది మరి మాములు విషయం కాదు, ఆ ప్రాజెక్ట్ పై ఎంతగా కాన్ఫిడెన్స్ లేకపోతే అంత టార్గెట్ పెట్టుకుంటారు.
ఐకాన్ టైటిల్ పరిశీలనలో ఉన్న AA 22 ప్రాజెక్ట్ ని ముంబై వేదికగానే తెరకెక్కిస్తారని, అవసరమైతే హైదరాబాద్ లోను స్పెషల్ సెట్ వేసి ఈ భారీ ప్రాజెక్ట్ ను 500 నుంచి 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారని, ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా .. అందులో ఇప్పటికే దీపికా పదుకోన్ ఫైనల్ అయ్యింది.