బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణ చిత్రంలో రాముడిగా హిందీ హీరో రణబీర్ కపూర్ ని ఎంచుకున్న మేకర్స్ సీత గా సౌత్ గర్ల్ సాయి పల్లవి ని ఎంచుకోవడం నిజంగా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. టాప్ హీరోయిన్స్, బాలీవుడ్ బడా హీరోయిన్స్ ని కాదని సాయి పల్లవి ని సీత పాత్ర వరించడం అందరికి షాకిచ్చింది.
అయితే తాజాగా రామాయణ మేకర్స్ సీత పాత్ర కోసం సాయి పల్లవి నే ఎందుకు ఎంచుకున్నారో అనేది రివీల్ చేసారు. సాయిపల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని, అందం కోసం ఇప్పటివరకు ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, కృత్రిమంగా కంటే సహజ అందమే బాగుంటుందనే సందేశం ఇచ్చినట్లుగా ఆమె ఉంటుందని అందుకే సీతాదేవిగా సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఇక బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని రాముడిగా ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా రివీల్ చేసారు.. రణబీర్ ప్రశాంతమైన వ్యక్తిత్వం, గొప్పగా నటించే నైపుణ్యమే రాముడి కేరెక్టర్ కి ఎంపిక చెయ్యడానికి కారణమని చెప్పారు. ఈ చిత్రంలో హీరో యష్ రావణ్ గా కనిపిస్తున్నారు.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా రామాయణం చిత్రాన్ని దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్ ఖర్చు తో భారీగా రెండు పార్టులుగా నిర్మిస్తున్నారు.