చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు నిజంగానే పెళ్లి పీటలెక్కబోతుంది. చిన్నారి పెళ్లి కూతురుగా హిందీ నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న అవికా గోర్ హీరోయిన్ గాను తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హీరోయిన్ గా టాప్ పొజిషన్ కి చేరలేకపోయిన అవికా గోర్ ఇప్పుడు కోరుకున్న వాడితో పెళ్లి పీటలెక్కబోతుంది.
ఈమధ్యనే బాయ్ ఫ్రెండ్ మిలింద్ చాంద్వానీతో నిశ్చితార్థం చేసుకుంది. తనకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక తాజాగా అవికా గోర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.
అవికా వెకేషన్ ఫొటోస్ చూసిన వారు అవికాకు పెళ్లి కళ వచ్చేసింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
అవికా గోర్ తన ప్రియుడు, కాబోయేవాడు మిలింద్ చాంద్వానీ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది అంటూ అవిక ఆనందాన్ని, ఆమె ఫేస్ లో ఉన్న గ్లో చూసిన వారు మాట్లాడుకోవడమే కాదు పెళ్ళెప్పుడు అవికా అని అడుగుతున్నారు.