వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. లిక్కర్ స్కామ్ లో ఏ4గా మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవ్వకుండా సుప్రీంకోర్టు కి వెళ్లి బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చెయ్యగా.. లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
అంతేకాకుండా మిథున్ రెడ్డి సరెండర్ అయ్యేందుకు సమయమిచ్చేందుకు కూడా కోర్టు విముఖత చూపింది. ముందుస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అరెస్ట్ అవ్వకుండా మిథున్ రెడ్డి ముందుగా ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వెయ్యగా హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టిపారేసింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారుల షాక్ ఇవ్వడమే కాదు, మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తూ.. అరెస్ట్ వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా... ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లుకౌట్ నోటీసులు జారీ చేసింది మిథున్ రెడ్డి అరెస్టుకు చట్టప్రకారం ముందుకెళుతున్నారు సిట్ అధికారులు.