అఖండ తాండవం సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ కాబోతుంది, డిసెంబర్ 18 స్లాట్ బుక్ చేసుకోవడానికి ఓటీటీ డీల్ కోసం మేకర్స్ వెయిటింగ్, షూటింగ్ పూర్తయినా ఇంకా గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉండడంతో సెప్టెంబర్ 25 కి అఖండ 2 ని విడుదల చెయ్యడం అసాధ్యం, అందుకే మేకర్స్ డిసెంబర్ కి వెళ్లొచ్చనే ఊహాగానాలకు ఇపుడు చెక్ పెట్టారు.
అఖండ 2 ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ కాదు, అఖండ 2 దసరా బరి నుంచి తప్పుకోదు, అందుకు తగ్గట్టుగానే అఖండ2 పోస్టు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అఖండ తాండవం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఆగష్టు చివరికల్లా అఖండ 2 కి సంబందించిన అన్ని పనులు పూర్తవుతాయని...
ఒకవేళ అవసరం అనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఓవర్సీస్ కి అఖండ 2 ప్రింట్స్ పంపించేస్తామని, తమ సినిమా వాయిదా పడదని, వాయిదా అంటూ వస్తోన్న వార్తలన్నీ జస్ట్ రూమర్స్, అఖండ తగ్గేదేలే అంటూ అఖండ 2 మేకర్స్ అఖండ 2 పోస్ట్ పోన్ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో నందమూరి అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.