కుర్ర హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ పలుమార్లు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ నెలాఖరు అంటే జులై 31 న విడుదల కాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్ డమ్ పాన్ ఇండియా ఫిలిం గా విడుదలకు సిద్దమైన వేళ కింగ్ డమ్ ప్రమోషన్స్ లో ఉండాల్సిన విజయ్ దేవరకొండ ఆసుపత్రి లో చేరడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగించింది.
విజయ్ దేవరకొండ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న విజయ్ దేవరకొండ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ ఆసుపత్రి నుంచి కోలుకుని రాగానే కింగ్ డమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది.