మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్ర రిలీజ్ తేదీపై సోషల్ మీడియాలో మెగా అభిమానులు మినీ యుద్ధమే చేస్తున్నారు. గ్రాఫిక్ వర్క్ పూర్తి కాకపోవడంతో దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నారు. మరోపక్క విశ్వంభర పై హైప్ క్రియేట్ చేసేందుకు వసిష్ఠ స్వయంగా రంగంలోకి దిగారు.
తాజాగా ఆయనొక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో వసిష్ఠ విశ్వంభర స్టోరీని ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు. హీరోయిన్(త్రిష) కోసం చిరంజీవి సాహోసోపేతంగా విశ్వంభర లోకి అడుగుపెట్టి అడ్డంకులు దాటుకుని హీరోయిన్ ని భూలోకానికి తెచ్చుకునేందుకు పడిన కష్టమే విశ్వంభర స్టోరీ లైన్ అంటూ వసిష్ఠ రివీల్ చేసారు.
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో దేవకన్య శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుని భూలోకానికి వస్తుంది. ఇక్కడ హీరోయిన్ కోసం చిరు నే భూలోకం నుంచి విశ్వంభర లోకి అడుగుపెడతారు.. అంటూ విశ్వంభర సింపుల్ స్టోరీ లైన్ ని దర్శకుడు వసిష్ఠ రివీల్ చేసారు.