ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తన భర్త, క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమకథ, బ్రేకప్ స్టోరి అభిమానుల్లో చర్చగా మారింది. ఇప్పుడు ఎవరి దారిలో వారు ఉన్నారు. కెరీర్ వేటలో బిజీ అయ్యారు. ధనశ్రీ వర్మ వరుసగా బుల్లితెర రియాలిటీ షోలతో బిజీ అవుతున్నారు. మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్ లో ఐటమ్ పాటల్లోను నర్తిస్తూ హాట్ టాపిగ్గా మారుతున్నారు.
తాజా సమాచారం మేరకు సల్మాన్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్ 19` షోలో ధనశ్రీ పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ధనశ్రీతో చర్చలు సాగిస్తున్నారు. దాదాపుగా ఈ హా* బ్యూటీ ఎంట్రీ ఖరారైనట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యజ్వేంద్ర చాహల్ తో విడాకుల కారణంగా గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రిటీగా ధనశ్రీ వర్మ పేరు మార్మోగింది.
ఇప్పుడు బిగ్ బాస్ ఇంటిలో ప్రవేశంతో ధనశ్రీ క్రేజ్ మరింత పెరగనుంది. మరోవైపు ధనశ్రీ `ఖత్రోన్ కే ఖిలాడి 15` కోసం లాక్ అయినా షో ఇంకా ప్రారంభం కాలేదు. ధనశ్రీ- చాహల్ జంటకు మార్చి 2025న విడాకులు మంజూరయ్యాయి. సోషల్ మీడియాల్లో ధనశ్రీ ఫోటోషూట్లు జోరుగా వైరల్ అవుతున్నాయి.