Advertisement
Google Ads BL

రవితేజ మాస్ జాతర ఓటీటీ బిజినెస్ క్లోజ్


మాస్ మహారాజ్ కొద్దిరోజులుగా వరస వైఫల్యాలతో సతమతవుతున్నారు. వరసగా డిజాస్టర్స్ పడడంతో రవితేజ మర్కెట్ కూడా పడిపోయింది. ప్రతి సినిమా ముందు విపరీతమైన హైప్ ఉంటున్నా సినిమా రిలీజ్ తర్వాత అది తుస్ మంటుంది. రవితేజ కథల ఎంపికలో లోపమో, దర్శకులు ప్రాబ్లెమ్ అనేది తెలియడం లేదు. 

Advertisement
CJ Advs

అయినప్పటికి వరస సినిమాలను లైన్ లో పెడుతున్న రవితేజ ఇప్పుడు మాస్ జాతర తో జాతర చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ జాతర చిత్రాన్ని భోగవరపు భాను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు క్రియేట్ చేసిన మాస్ జాతర ఓటీటీ హక్కులు క్రేజీ డీల్ తో క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. 

మాస్ జాతర నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని, మాస్ జాతర ఓటీటీ రైట్స్‌ను ఏకంగా రూ.20 కోట్ల భారీ డీల్ తో నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Mass Jathara OTT rights acquired:

Popular OTT giant acquires Mass Jathara OTT rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs