దర్శకధీరుడు రాజమౌళి వస్తే సినిమాకి క్రేజ్ వస్తుందా, టికెట్లు తెగుతాయా, ప్రేక్షకులు నమ్ముతారా ఇదే ఇప్పుడు జూనియర్ విషయంలో వినిపిస్తున్న ప్రశ్న. కిరీటి రెడ్డి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న జూనియర్ రేపు థియేటర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోటీశ్వరుడి కుర్రోడు, గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు, క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్.. అయినా సినిమాకి క్రేజ్ రాలేదనుకున్నారు.
అందుకే రాజమౌళి ని జూనియర్ ఈవెంట్ కి పిలిస్తే ఆడియన్స్ టికెట్ కొంటారని మేకర్స్ రాజమౌళి ని పట్టుబట్టి మరీ గెస్ట్ గా తీసుకొచ్చారు, కిరీటి రెడ్డి గురించి నాలుగు మంచి మాటలు చెప్పించారు. మరి రాజమౌళి ఖచ్చితంగా జూనియర్ కి హెల్ప్ అవుతారు, కానీ ఎంతవరకు, రాజమౌళి బ్రాండ్ చూసి కొత్త కుర్రాడు కిరీటి రెడ్డి సినిమా కోసం ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారా..
పెద్ద సినిమాలైనా భారీ బడ్జెట్ మూవీస్ అయినా టాక్ చూసాకే జనాలు థియేటర్స్ కి వెళుతున్న రోజులివి. రాజమౌళి వచ్చారని ఓ కొత్త కుర్రాడి మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.