నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ పై అంతకంతకు అంచనాలు పెంచే ప్రోమోస్ తో మల్లెమాల యాజమాన్యం ప్లాన్ చేసింది. నాగబాబు రీ ఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ చెయ్యడమే కాదు.. ఈ ఎపిసోడ్ కోసం జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న వేణు, ధనరాజ్, శ్రీను, చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్స్ మాత్రమే కాదు.. జబర్దస్త్ నుంచి పక్కకి తప్పుకున్న హైపర్ ఆది, అనసూయ ఇలా అందరూ జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ లో కనిపిస్తున్నారు.
నాగబాబు జెడ్జి గా రీ ఎంట్రీ ఇచ్చి కంటిన్యూ అవుతారా, లేదంటే ఈ ఎపిసోడ్ కి మాత్రమేనా అనేది పక్కనపెడితే.. హైపర్ ఆది కి అనసూయ కి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో గొడవ జరిగినట్టుగా ఆది వేసే పంచ్ డైలాగ్స్ వలనే తను జబర్దస్త్ వదిలేసినట్టుగా ఆ ప్రోమోలో అనసూయ చెప్పడం హైలెట్ అయ్యింది. బాబు గారు, ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నానో తెలుసా, వద్దు ఆది.. నేను మైక్ లోనే చెప్పేస్తాను అంటూ అనసూయ ఆదిపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది.
దానికి ఆది వరే నువ్వు అమెరికా వెళ్లినా నీకు లింకులు పంపించా, అది రా మన లింక్ ఏమనుకుంటున్నావ్ రా నువ్వు అనగానే ఇదిగో ఇలాంటివి మాట్లాడినందుకే నేను షో నుంచి వెళ్ళిపోయింది అంటూ అనసూయ కాస్త సీరియస్ గానే ఆది తో గొడవపడిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.