ఈమధ్యన పెద్ద సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటించాలంటే ముందుగా వాటి డిజిటల్ హక్కులను దక్కించుకునే ఓటీటీ లను సంప్రదించాకే ఆయా సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటిస్తున్నారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు, కింగ్ డమ్ ఇలా చాలా సినిమాలు ఓటీటీ పార్ట్నర్స్ డిమాండ్స్ మేరకు రిలీజ్ తేదీలను ప్రకటించాయి.
ఇక ప్రభాస్ రాజా సాబ్ అంతే. ఇప్పుడు అఖండ తాండవానికి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అఖండ 2 సెప్టెంబర్ 25 విడుదల అంటూ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ జరుగుతుంది. కానీ గ్రాఫిక్ వర్క్స్ పెండింగ్ కారణంగా సెప్టెంబ 25 న అఖండ 2 రాకపోవచ్చు, అది డిసెంబర్ లో క్రిష్టమస్ సీజన్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనే టాక్ వినిపిస్తుంది.
అఖండ 2 కి సంబందించిన ఓటీటీ డీల్ పూర్తి కాలేదు అని, అఖండ తాండవం ఓటీటీ హక్కులను దక్కించుకునే సంస్థే అఖండ 2 విడుదల తేదీని డిసైడ్ చేస్తుంది అంటున్నారు. డిసెంబర్ 18 అయితే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఆలోచిస్తున్నారు, మరి అఖండ ఏ ఓటీటీ డీల్ సెట్ అయితే కానీ రిలీజ్ తేదీ సస్పెన్స్ తెగదన్నమాట.