లొకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం కూలి ఆగష్టు 14న విడుదలకు సిద్దమవుతున్నా.. ఆ చిత్రంలో నటిస్తున్న క్రేజీ స్టార్స్ లుక్స్ ఇంకా బయటికి రాలేదు. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఇలా టాప్ స్టార్స్ కూలీలో భాగమయ్యారు. అయితే ఈ చిత్రం లోని హీరోల లుక్స్ ఇంకా లోకేష్ కనగరాజ్ వదల్లేదు. దానితో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
తాజాగా లొకేష్ కనగరాజ్ కూలి చిత్రానికి సంబందించిన విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నాడు. అందులో కూలి చిత్రం ట్రైలర్ వచ్చేవరకు హీరో లుక్స్ రివీల్ చెయ్యకూడదు అనుకున్నాను, ఆగష్టు 2 న కూలి ట్రైలర్ రాబోతుంది. కూలి ట్రైలర్ లోనే హీరోల లుక్స్ బయటికి వస్తాయి. ఇక కూలి ట్రైలర్ తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నాము. కూలి కమర్షియల్ మూవీ అయినా అందులో ఎమోషన్స్ ఉంటాయి, రజినీకాంత్ ఫైట్స్ కి అభిమానులు విజిల్స్ వేస్తారంటూ లోకేష్ కనగరాజ్ సినిమాపై అంచనాలు పెంచేశారు.
రజనీకాంత్ కూలీ సినిమాను డబ్బింగ్ స్టూడియోలో చూశారు. ఆ తర్వాత నన్ను హగ్ చేసుకున్నారు. నాకు ఇది దళపతిలా అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అంటూ రజినీకాంత్ కూలి ని చూసి అప్రిషెట్ చేసిన విషయాన్ని లోకేష్ కనగరాజ్ రివీల్ చేసారు.