సలార్ తో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మధ్యలో ఈగో క్లాష్, అందుకే సలార్2 ని పక్కనపెట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టారు, ఇప్పుడప్పుడే సలార్ 2 ఉండకపోవచ్చనే ప్రచారం ఒకప్పుడు జోరుగా జరిగింది.
కానీ ప్రభాస్ సలార్ 2కి బ్రేక్ ఇవ్వడం వలనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేసారు అనేది చాలామందికి తెలియదు. అయితే వీరి మద్యన ఎలాంటి క్లాష్ లేదు. అప్పడు హను రాఘవపూడి మూవీ ఓపెనింగ్ లో ప్రభాస్ కోసం నీల్ వస్తే.. ఇప్పుడు ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో హాలీవుడ్ మూవీని వీక్షించడం హైలెట్ అయ్యింది.
హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్1 చిత్రాన్ని ప్రభాస్-నీల్ కలిసి ప్రసాద్ మల్టిప్లెక్స్ లో వీక్షించారు. సినిమా చూసిన తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ అక్కడి థియేటర్ సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంత కలిసిమెలిసి కనిపించిన వీరిద్దరి మధ్యలో క్లాష్ అంటే ఎవ్వరైనా నమ్ముతారా. అస్సలు నమ్మరు. మరి హాలీవుడ్ మూవీ కోసం కలిసిన ప్రభాస్-నీల్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.