నేను నా భార్యకు సరైన భాగస్వామిని కాను. వివాహానికి సరైన వ్యక్తిని కాను! అని అంగీకరించాడు స్టార్ హీరో జాన్ అబ్రహాం. కానీ తన భార్య మాత్రం స్థిరత్వంతో పరిపూర్ణత ఉన్న వ్యక్తి అని ప్రశంసించాడు. అంతేకాదు.. తన నేను చాలా తప్పుగా ఉన్నానని గ్రహించినట్టు కూడా చెప్పాడు. భార్యాభర్తల బంధంలో నిజాయితీ పరిపూర్ణతపై మాట్లాడిన జాన్ ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పాడు.
జాన్ అబ్రహాం తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..``నేను చాలా రాంగ్ పర్సన్. బహుశా పరిపూర్ణ భాగస్వామిని కాదు. ప్రియ ఈ పెళ్లి బంధానికి చాలా పరిణతిని తీసుకువస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా తెలివితేటలు, చాలా స్థిరత్వం ఉన్న మంచి వ్యక్తి. పరిశ్రమలో వెన్నంటి ఉండే వ్యక్తులు నా విషయంలో చాలా అరుదు. కానీ తను నా వెన్నంటి నిలిచి ప్రోత్సహిస్తుంది. అలాగే నా కుటుంబం మీడియా గ్లేర్ లోకి రావడం ఆసక్తి లేదు. నేను కాసేపు ఆలోచించి నిజాయితీగా ఏదైనా పని చేయడానికి ఇష్టపడతాను`` అని చెప్పాడు.
అలాగే తన కంపెనీలను విస్తరించేందుకు చాలా శ్రమిస్తున్నానని పిల్లల్ని కనేందుకు సమయం కేటాయించలేదని కూడా జాన్ అబ్రహాం చెప్పాడు. అలాగే పిల్లలకు అన్నిటినీ సమకూర్చే వరకూ తమకు తొందరపాటు లేదని అతడి భార్య ప్రియా కూడా చెప్పారు. ఈ జంటకు 11 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా పిల్లల్ని కనాలని అనకోలేదని తెలిపారు. జాన్ అబ్రహాం నటుడిగా బిజీ. సినీనిర్మాతగా కొనసాగుతున్నాడు. దీంతో పాటు పలు కంపెనీలను నిర్వహిస్తున్నానని వెల్లడించాడు. ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిని నిలబెట్టేందుకు అతడు చాలా శ్రమిస్తున్నానని చెప్పాడు.
జాన్ అబ్రహాం బాలీవుడ్ లో మూడు దశాబ్ధాలుగా కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాల్ని అందుకున్నాడు. అతడు నటించిన ది డిప్లమాట్ ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక పెద్ద విజయం సాధించింది.