కింగ్ నాగార్జున ఈమధ్యన స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ కేరెక్టర్స్ తో అద్దరగొట్టేస్తున్నారు. గతంలో హిందీ బ్రహ్మాస్త్ర లో కీ రోల్ పోషించారు. అందులో రణబీర్ కపూర్, అమితాబ్, అలియా లాంటి స్టార్స్ నటించారు. ఆతర్వాత ధనుష్ కుబేర లో కీలక పాత్రలో కనిపించారు. అది ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఇక రాబోయే సూపర్ స్టార్ కూలి చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారు. తనని గత 40 ఏళ్లలో చూడని కొత్త వెర్షన్ లో చూస్తారని నాగార్జున ఈమధ్యనే రివీల్ చేసారు. ఇప్పుడు తాజాగా లోకేష్ కనగరాజ్ నాగార్జున కూలి పాత్ర గురించి మాట్లాడుతూ.. నాగ్ సర్ ని ఈ పాత్ర కోసం ఒప్పించడం అంత తేలిక కాదని, తన పాత్రపై ఐడియా ఆయనకి ఎంతో నచ్చింది అన్నారు.
ఆ తర్వాత కూలి లో నాగార్జున పాత్రను తీర్చిదిద్దడం మాత్రం సవాలుగా మారిందని, దగ్గరదగ్గర ఏడెనిమిది సార్లు నాగ్ కి స్క్రిప్ట్ నరేషన్ ని ఇచ్చినట్టు లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. అసలు నాగార్జునను కూలి పాత్రకు ఒప్పించడం మాత్రం ఒకింత కష్టమే అని లోకేష్ తెలిపాడు. అలా కాబట్టే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి నాగ్ సక్సెస్ అవుతున్నారు. మరి విలన్ గా నాగ్ ఎలా ఉండబోతున్నారో అనే క్యూరియాసిటీ అక్కినేని అభిమానుల్లో అంతకంతకు ఎక్కువైపోతోంది.