ఈనెల 24 న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం మళ్లీ బాక్సాఫీసు వద్ద కళ తెస్తుంది అని మూవీ లవర్స్ అందరూ ఆశపడుతున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ పై చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ వీరమల్లు తో హిట్ కొట్టాలని వారు బలంగా కోరుకుంటున్నారు.
అయితే హరి హర వీరమల్లు ఒకవేళ పాన్ ఇండియా రేంజ్ హిట్ అయితే గనక ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే విషయంలో చాలామందిలో క్యూరియాసిటీ కనిపిస్తుంది. కారణం 70 శాతం హరి హర వీరమల్లు ని దర్శకుడు క్రిష్ పూర్తి చేసి ఆయన పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ వచ్చి మిగతా బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసారు.
ఆ క్రమంలోనే విలన్ బాబీ డియోల్ రోల్ ని జ్యోతి కృష్ణ మార్చేశారని అన్నారు. అయితే వీరమల్లు హిట్ క్రెడిట్ క్రిష్ కి వెళుతుందా, లేదంటే జ్యోతి కృష్ణ కి వెళుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మరి ఆ విషయం తెలియాలంటే మరొక్క పది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.