గుట్టు చప్పుడు కాకుండా కొన్నిటిని కానిచ్చేయాలి. అనవసర ప్రచారం దండగ ప్రయాస. ఇటీవలి కాలంలో కొందరు సెలబ్రిటీల తీరు ఇలానే ఉంది. నచ్చితే ఒకరితో డేట్ చేయాలి.. షికార్లు చేయాలి కానీ, అనవసర ప్రచారం దేనికి? అని జాగ్రత్త పడుతున్నారు. అయితే కొందరు మాత్రం డేటింగ్ లైఫ్ కి కూడా విస్త్రతమైన ప్రచారం కావాలని కోరుకుంటారు.
ఈ రెండో కేటగిరీకే చెందుతుంది ఊర్వశి రౌతేలా. ఇంతకుముందు యువ క్రికెటర్ రిషబ్ పంథ్ తన కోసం హోటల్ గది బయట గంటల సమయం వేచి చూసాడని కామెంట్ చేసి దుమారం రేపింది. ఆ తర్వాత అతడితో కొన్ని నెలల పాటు సాగిన తీవ్రమైన వైరం గురించి తెలిసిందే. కొన్ని వివాదాలతో పాపులరైన ఊర్వశి ఇప్పుడు వింబుల్డన్ 2025 ఫైనల్ మ్యాచ్ లోను సందడి చేసింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైట్ అండ్ వైట్ డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయిన ఊర్వశితో కలిసి ఉన్న ఒక షాడోమ్యాన్ ఫోటోని నెటిజనులు వైరల్ చేస్తున్నారు. వింబుల్డన్ కోసం లండన్ కు వచ్చిన ఊర్వశి తన బోయ్ ఫ్రెండ్ ని కూడా వెంట తెచ్చుకుందన్న ప్రచారం వైరల్ అయిపోతోంది.
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్లతో అలరించిన ఊర్వశి రౌతేలాకు ఇటీవల అంతగా అవకాశాల్లేవ్. అటు బాలీవుడ్ లోను ఈ భామకు ఆశించిన ఛాన్సుల్లేవ్. అయినా తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.