కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లను నిర్మించింది హోంబలే సంస్థ. ఇప్పుడు హోంబలే నిర్మాతలు `మహావతార్` సినిమాటిక్ యూనివర్స్ ని ప్రారంభిస్తున్నామని ప్రకటించగానే సర్వత్రా ఆసక్తి పెరిగింది. పురాణేతిహాస కథల్ని యానిమేటెడ్ బొమ్మలతో సినిమాలుగా చూపించాలన్న ఆలోచన ఎంతగానో ఆకర్షించింది. ఇంతకుముందు విడుదల చేసిన మొదటి సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.
బాలుడైన భక్త ప్రహ్లాదుని రక్షించడానికి స్థంభాన్ని చీల్చుకుని పుట్టుకు వచ్చే నరసింహ స్వామి అవతారాన్ని, దానితో ముడి పడి ఉన్న కథ కథనాలను తెరపై చూపించనున్నారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన సిరీస్ లోని మొదటి చిత్రం జూలై 25న ఐదు భారతీయ భాషలలో 3డిలో విడుదల కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇరు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు హక్కుల్ని ఛేజిక్కించుకుంది. ఆ మేరకు పోస్టర్ కూడా వైరల్ అవుతోంది.
`మహావతార్ నరసింహా`.. ఇటీవల ఎక్కువగా చర్చల్లో ఉన్న యానిమేటెడ్ సినిమా. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ సిరీస్ సినిమాలను నిర్మిస్తోంది. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హోంబలే ఫిల్మ్స్ సమర్పిస్తోంది. ఇంతకుముందు విడుదల చేసిన రిలీజ్ క్యాలెండర్ లో 2025లో `మహావతార్ నర్సింహ` మొదటగా విడుదలవుతుంది. ఆ తర్వాత మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధ్వారకాధీష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) విడుదలవుతాయి.
బాలుడైన భక్త ప్రహ్లాదుని రక్షించడానికి స్థంభాన్ని చీల్చుకుని పుట్టుకు వచ్చే నరసింహ స్వామి అవతారాన్ని, దానితో ముడి పడి ఉన్న కథ కథనాలను తెరపై చూపించనున్నారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన సిరీస్ లోని మొదటి చిత్రం జూలై 25న ఐదు భారతీయ భాషలలో 3డిలో విడుదల కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇరు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు హక్కుల్ని ఛేజిక్కించుకుంది. ఆ మేరకు పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. అంతేకాదు.. హోంబలే నిర్మాణ సంస్థతో భాగస్వామ్యంలో గీతా ఆర్ట్స్ మునుముందు భారీ పాన్ వరల్డ్ సినిమాలను నిర్మిస్తుందని కూడా ప్రచారం సాగుతోంది. అయితే దీనిని ఇరు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.