Advertisement
Google Ads BL

భర్త కశ్యప్ తో విడిపోతున్న సైనా నెహ్వాల్


ప్రముఖ బాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త కశ్యప్ తో విడిపోతున్నట్లుగా సంచలన ప్రకటన చెయ్యడం వారి అభిమానులకు షాకిచ్చింది. ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్ విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో.. 

Advertisement
CJ Advs

కొన్నిసార్లు జీవితం మనల్ని వేరు వేరు దార్లలోకి తీసుకెళుతూ ఉంటుంది. ఎన్నో ఆలోచనల తర్వాత నేను, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాము. మేమిద్దరం ఏంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం, మేము స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం, మా కోసం మేము శాంతిని, ఎదుగుదలను, సాంత్వనను కోరుకుంటున్నాము. ఈ కష్ట సమయంలో మమ్మల్ని అర్థం చేసుకుని, మా ప్రైవసీని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 

2002లో ఇద్దరూ ఒకే చోట బాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకోవటం మొదలెట్టి.. 2004 నుంచి ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. 2018, డిసెంబర్ 14వ తేదీన ఇద్దరూ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఏడేళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ ఇప్పుడు ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారు. 

Saina Nehwal Announces Separation From Husband:

Saina Nehwal and Parupalli Kashyap have announced their decision to part ways after marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs