స్టార్ మా లో అనసూయ జెడ్జి చేస్తోన్న కిర్రాక్ బాయ్స్-కిలాడి గర్ల్స్ షో ఫినిష్ అయ్యింది. ఆ షో కోసం అనసూయ ప్రతి శనివారం చేసే గ్లామర్ రచ్చ సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. సినిమాల్లో పద్దతి గల కేరెక్టర్స్ లో కనిపించే అనసూయ బుల్లితెర పై మాత్రం అందాలు ఆరబొయ్యడంలో ఆరితేరిపోయింది.
యాంకరింగ్ కి గ్లామర్ మెరుపులు అద్దిందే అనసూయ భరద్వాజ్. ఈమధ్యన ఆన్ లైన్ లో బట్టలు షాపింగ్ చేసి మోసపోయాను అంటూ రీసెంట్ గా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ మోసాన్ని బయటపెట్టింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా డ్రామా జూనియర్స్ లోకి ఎంటరయ్యింది.
రోజా, అనిల్ రావిపూడి జెడ్జిలుగా మొదలైన జీ తెలుగులో మొదలైన డ్రామా జూనియర్స్ షో బాగా హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ షో కి అనసూయ వస్తుంది. అందుకోసమే చీర లో అనసూయ స్పెషల్ గా రెడీ అయిన తన కొత్త లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది వేంటనే వైరల్ అయ్యింది.