కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ వ్యాఖ్యలతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సొంత పార్టీపైనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే తీన్మార్ మల్లన్న రీసెంట్ గా ఎమ్యెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితం కవిత అనుచరులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై తెగబడి దాడి చేసి మల్లన్న ను దొరికితే కొట్టే ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
కవిత బీసీ ఉద్యమాన్ని ప్రశ్నించే క్రమంలో తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవితకు బీసీలతో సంబంధం ఏమిటని, కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత అనుచరులు భగ్గుమంటున్నారు. మంచం పొత్తు అనే మాట అభ్యంతరకరంగా ఉండటంతో కవిత అనుచరులు తీన్మార్ మల్లన్న దొరోకితే కొట్టేసేలా ఉన్నారు.
ఆ క్రమంలోనే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కవిత అనుచరులు దాడి చేశారు. క్యూ న్యూస్ కార్యాలయంలో మల్లన్న ఉన్న విషయం తెలుసుకున్న కవిత అనుచరులు దాదాపుగా యాభై మంది ఆ కార్యాలంపై దాడి చేశారు. దాడి నుంచి మల్లన్న తప్పించుకున్నప్పటికీ.. ఆయన గన్‌మెన్‌పై కవిత అనుచరులు దాడి చెయ్యగా.. దాడిని తట్టుకోలేక లోపలికి వెళ్లిన గన్‌మెన్ ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. మహిళా నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం పట్ల మల్లన్న పై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.