ఆగష్టు 14 న సౌత్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజినీకాంత్ లు పాన్ ఇండియా ఫిలిమ్స్ తో బాక్సాఫీసు పోటీకి దిగుతున్నారు. కూలి vs వార్ 2 చిత్రాలు ఆగష్టు 14 న రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ వార్ 2 తో పాటుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కూలి లు విడుదలవుతున్నాయి.
అయితే కూలి చిత్రంలో మోనికా అంటూ బుట్టబొమ్మ పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ తో గత్తర లేపింది. తాజాగా విడుదలైన కూలి మోనికా సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. పూజ హెగ్డే రెడ్ మోడ్రెన్ డ్రెస్ లో అద్దరగొట్టే స్టెప్పులేసింది. ఇక వార్ 2 హీరోయిన్ కియారా అద్వానీ బికినీ షో తో వార్ 2 టీజర్ లో మెరిసింది. కియారా బికినీ షాట్ వార్ 2 టీజర్ లో తెగ హైలెట్ అయ్యింది.
కియారా అద్వానీ టీజర్ లోనే ఆ విధంగా కనిపిస్తే వార్ 2 సినిమా మొత్తం ఇంకెన్ని బికినీ షాట్స్ ఉంటాయో అంటూ కియారా ఫ్యాన్స్ యూత్ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 14 న పూజ హెగ్డే కి కియారా గ్లామర్ కి పెద్ద పోటినే అంటూ పూజ హెగ్డే ఫ్యాన్స్ ఆరాటపడుతుంటే.. కియారా తో పూజ హెగ్డే కి పోటీనా.. అంత సీన్ లేదు బుట్టబొమ్మకి అంటూ కియారా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.