బిగ్ బాస్ 9 మొదలు కావడానికి ఏంతో సమయం లేదు, ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ కంప్లీట్ కావొచ్చింది. మరోపక్క యాజమాన్యం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉంది. నాగార్జున హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమోస్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేశాయి.
అలాగే ఈసారి సీజన్ 9 లోకి కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుంది. అందుకు సంబందించిన ప్రాసెస్ మొదలైపోయింది. దానికోసం కోకొల్లలుగా అప్లికేషన్స్ యాజమాన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లే వాళ్ళ పేర్లు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ కోసం బుల్లి తెర, వెండి తెర నటీ నటులు, సింగర్స్, యాంకర్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్‌ను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేసారని తెలుస్తుంది.
సీరియల్ నటులు సాయి కిరణ్, కమెడియన్ ఇమాన్యూల్, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లో రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని ఎంపిక చేశారు అని వాళ్లతో పాటుగా దెబ్జానీ, సుమంత్ అశ్విన్, శివ కుమార్, ముఖేష్ గౌడ, నవ్య సామి కూడా ఈసారి హౌస్ లోకి వెళ్లే వాళ్ళలో ఉన్నట్లుగా తెలుస్తుంది.