మెగాస్టార్ చిరంజీవి-క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న #Mega 157 (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ కూడా కుర్ర హీరో మాదిరి అనిల్ రావిపూడి తో జర్నీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు డ్రిల్ మాస్టర్ పాత్రలో కామెడీ, ఎమోషన్స్ పండించబోతున్నారు.
నయనతార మెగాస్టార్ కి వైఫ్ గా కనిపిస్తుండగా.. వెంకటేష్ అతిధి పాత్రలో మెరుస్తున్నారు. ఇక మెగా157 టైటిల్ అండ్ టీజర్ ని చిరు బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 22 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని అంటుంటే.. ఈ చిత్రంలో చిరు పాత్ర డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ గా ఉండబోతుంది అని, అందుకే టైటిల్ గా మన శంకర్ వరప్రసాద్ గారు… అంటూ వెరైటీ గా ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి.
సంక్రాంతికి వస్తున్నాం అనే క్రేజీ టైటిల్ తో సంక్రాంతి కి వచ్చి హిట్ పట్టుకుపోయిన అనిల్ రావిపూడి ఈసారి మన శంకర్ వరప్రసాద్ గారు… అని మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారంటున్నారు. మరి ఫైనల్ గా మెగా 157 కి ఏ టైటిల్ పెడతారో అనేది ఆగస్టు 22 న రివీల్ అవుతుంది.