గుడివాడలో రాజకీయ రణరంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలేట్ అయ్యింది. పులి లా బిల్డప్ ఇచ్చే కొడాలి నాని 2024 ఎన్నికల్లో ఓడిపోయాక కామ్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడి ఆసుపత్రి పాలై చివరికి గుడివాడ కు దూరమయ్యాడు. కొడాలి నాని సైలెంట్ అయిన సమయంలో ఎమ్యెల్యే రాము ఎక్కువగా క్రేజ్ తెచ్చుకున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు పై కొడాలి నాని ఓ ఛాలెంజ్ చేసాడు. దానిపై టీడీపీ కార్యకర్తలు తాజాగా కొడాలి నాని చంద్రబాబు బూట్లు తుడవాలి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు టీడీపీ నేతలు.. అదే సమయంలో బాబు ష్యూరిటీ మోసాలు గ్యారంటీ పేరుతో పోటీ గా వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసారు.
దానితో టీడీపీ-వైసీపీ పార్టీల నేతల మధ్య ఫ్లెక్సీలు పంచాయితీ పీక్స్ కి చేరి ఘర్షణకు దారి తీసింది. టీడీపీ - వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.