పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో `పౌజీ`, మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` లో నటిస్తున్నాడు. రాజాసాబ్ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసింది. `పౌజీ` షూటింగ్ యాభైశాతం పూర్తయింది. మరిప్పుడు` పౌజీ` షూటింగ్ కొన్ని నెలల పాటు హోల్డ్ లో పడుతుందా? `పౌజీ `కంటే ముందుగానే `స్పిరిట్` రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే గాలీ అలాగే వీస్తోంది.
`స్పిరిట్` చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కించడానికి సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడు. తొలుత `కల్కి 2` మొదలవుతుందనుకున్నా? అదంతా తప్పుడు ప్రచారమని తేలపోవడంతో పాటు `స్పిరిట్` పై క్లారిటీ వచ్చింది. `స్పిరిట్` మొదలైతే గనుక ప్రభాస్ సందీప్ రెడ్డికి బాండ్ అయి పనిచేయాల్సి ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం మరో సినిమా చేయడానికి వీలు లేదు. ఇది ఇద్దరి మధ్య ఉన్న కండీషన్.
ప్రభాస్ తన పాత్ర నుంచి డీవియేట్ కాకుండా ఉండాలంటే తనకు మాత్రమే కట్టుబడి పనిచేయాలి. అప్పుడే పర్పెక్షన్ వస్తుంది. డైరెక్టర్ రాజమౌళి తరహాలోనే పాత్రల పరంగా సందీప్ థింకింగ్ ప్రాసస్ ఉంటుంది. `స్పిరిట్` మొదలైతే గనుక రిలీజ్ అవ్వడానికి ఎలా లేదన్నా ఏడాది నుంచి ఏడాదిన్నర సమ యం పడుతుంది. సందీప్ కూడా ఫాస్ట్ మేకర్ కాదు. నెమ్మదిగానే సినిమా చేస్తాడు.
అంటే `పౌజీ` రిలీజ్ అన్నది 2027లో ఉంటుంది. మరి అంత వరకూ `పౌజీ` పూర్తి చేసే అవకాశం లేదా? అంటే అది పూర్తిగా సందీప్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. మధ్యలో `స్పిరిట్` కు భారీగా గ్యాప్ ఇస్తే గనుక ప్రభాస్ `పౌజీ` పెండింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వచ్చే ఏడాది `పౌజీ` పక్కాగా రిలీజ్ అవుతుంది. లేదంటే ఇదీ కూడా 2027 లోనే.