తమిళం- తెలుగు- హిందీ సహా పలు ఇతర భాషల్లో నటించిన రాయ్ లక్ష్మీ ఆశించిన స్టార్ డమ్ ని అందుకోవడంలో తడబడింది. అయినా సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ కి కొదవేమీ లేదు. ఈ భామ నిరంతర ఫోటోషూట్లకు లక్షల్లో అనుచరులున్నారు. తన అభిమానులను నిరాశపరచకుండా ఇన్ స్టాలో రాయ్ లక్ష్మీ ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోటోషూట్లను షేర్ చేస్తూనే ఉంది. వీటికి రెస్పాన్స్ ఒక రేంజులో ఉంటుంది.
ఇప్పుడు అలాంటి ఒక ఫోటోషూట్ తో రాయ్ లక్ష్మీ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ బ్యూటీ ఎరుపు రంగు ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఓవైపు బాటమ్ లైన్ అందాలను ఆవిష్కరిస్తూనే, హాఫ్ షోల్డర్ లుక్ లో స్పెషల్ గా కనిపిస్తోంది. లక్ష్మీ ఎంపిక చేసుకున్న గాగుల్స్ యూనిక్ నెస్ తో ఆకర్షిస్తున్నాయి.
బలుపు, ఖైదీ నంబర్ 150 సహా పలు బ్లాక బస్టర్ చిత్రాల్లో ఐటమ్ నంబర్లలో మెరిసిన రాయ్ లక్ష్మీకి ఇటీవల తెలుగు చిత్రసీమలోను అవాకశాల్లేవ్. రాయ్ లక్ష్మీ ప్రస్తుతం లండన్ విహార యాత్రలో ఉంది. లివ్ లవ్ లండన్ అనే క్యాప్షన్ తో ఈ ఫోటోషూట్ ని షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.