పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హరి హర వీరమల్లును పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవడమే కాదు, పాన్ ఇండియా మూవీ గానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి, హరి హర వీరమల్లు అలా కనిపించడమే లేదు అనేది పవన్ ఫ్యాన్స్ వాదన.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో కనిపించరు, అదే పెద్ద మైనస్, కేవలం వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే పవన్ కనిపిస్తే పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ పెరుగుతుందా అనేది అతి పెద్ద ప్రశ్న. మరి ఏఎం రత్నం గారు ఎంతగా సినిమాని ప్రమో చేసినా అది తెలుగు ప్రేక్షకులకు రీచ్ అవుతుంది.
కానీ పాన్ ఇండియా ఆడియన్స్ కి పవన్ గురించి ఏం ఎక్కుతుంది. వీరమల్లు రిలీజ్ కి ఉన్న సమయం 13 రోజులు. ఇంతవరకు షేక్ అయ్యే ఈవెంట్ ఏది వీరమల్లు కు జరగలేదు. అదే పవన్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ టాక్ వచ్చినా వీరమల్లు ను హిట్ చెయ్యొచ్చు, పాన్ ఇండియాలోని భాషల్లో ఏం చేయలేము అనేది వారి బాధ. మరి ఈ రెండు వారాల్లో వీరమల్లు ఈవెంట్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూద్దం.