Advertisement
Google Ads BL

అద్దె గ‌దిలో పాక్ న‌టి మృతి.. తండ్రికి కాల్ చేస్తే!


మాన‌వ‌త్వం మంట క‌లిసిపోయిన రోజులివి. కుటుంబ బంధాలు బాంధ‌వ్యాలు ఏమ‌వుతున్నాయో ఊహించ‌లేని ధైన్యం నెల‌కొంది. కుమార్తె చ‌నిపోయింద‌ని తెలిసినా, ఆ క‌సాయి తండ్రి త‌న‌తో తెగ‌తెంపులు చేసుకున్నామ‌ని ఆ శ‌వంతో మాకు సంబంధం లేద‌ని చెప్పాడు. ఆ మృత‌దేహాన్ని ఏం చేస్కుంటారో మీ ఇష్టం! అని అన్నాడు. ఇలా చెప్పిన వ్య‌క్తి  ఒక ప్ర‌ముఖ‌ డాక్ట‌ర్... ఆర్మీలో ప‌ని చేసిన‌ ఉన్న‌త విద్యావంతుడు.

Advertisement
CJ Advs

ఈ ఘ‌ట‌న జ‌రిగింది పాకిస్తాన్ లో. ప్ర‌ముఖ పాకిస్తానీ న‌టి అస్గర్ అలీ క‌రాచీ(పాకిస్తాన్‌)లో తాను నివ‌శిస్తున్న అద్దె ఇంట్లో మృతి చెందింది. ఆమె మృత‌దేహం కుళ్లిన స్థితిలో క‌నిపించింది. మ‌ర‌ణించి రెండు వారాలైందని చెబుతున్నారు. అయితే ఈ మ‌ర‌ణం గురించి కుటుంబీకుల‌కు తెలిసినా కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఆమెతో మాకు ఎలాంటి సంబంధాల్లేవ్.. మేం ఆమె ద‌హ‌న సంస్కారాలు చేయ‌లేము. 

మృత‌దేహాన్ని ఏం చేస్కుంటారో మీ ఇష్టం అని పోలీసుల‌కు రెక్లెస్ గా స‌మాధాన‌మిచ్చాడు న‌టి తండ్రి.. డాక్ట‌ర్ అస్గ‌ర్ అలీ. అత‌డు ఆర్మీలో డాక్ట‌ర్ గా ప‌ని చేసారు. అయితే న‌టి అస్గ‌ర్ అలీ స‌హ‌నటీన‌టులు మాత్రం త‌న‌ను అలా చూస్తూ వ‌దిలేయ‌లేదు. ప‌లువురు త‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ముందుకు వచ్చారు. త‌మ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. 

Pakistani actress and model Humaira Asghar Ali was found dead in her apartment:

Humaira Asghar Ali was found dead in her Karachi apartment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs