డిసెంబర్ 5 డేట్ ఇప్పుడు క్రేజీగా మారిపోయింది. కారణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది. అలాగే అదే రోజు మరో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ దురంధర్ కూడా ఆ డిసెంబర్ 5 నే విడుదల కావడం అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది.
కానీ ఆ రెండు సినిమాల్లో అంటే రాజా సాబ్, దురంధర్ చిత్రాల్లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజిత్ దత్ ఒకే రోజు రెండు సినిమాలతో పోటీ పడడం మాత్రం అందరిలో ఆసక్తిని కలిగిస్తే సంజయ్ దత్ మాత్రం రాజాసాబ్, దురంధర్ సినిమా రిలీజ్ క్లాష్ గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు. రాజా సాబ్, దురంధర్ రెండు చిత్రాల టీజర్స్ లో మీ కేరెక్టర్, మీ పాత్రల లుక్స్ సూపర్ గా ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు రాజా సాబ్, దురంధర్ ఒకే రోజు రిలీజ్ కానున్నాయి. ఒకే రోజు ఫ్యాన్స్ మిమ్మల్ని రెండు డిఫరెంట్ లుక్స్ లో చూడనున్నారు. రాజా సాబ్, దురంధర్ క్లాష్ గురించి మీరు ఏమంటారు అని అడిగిన ప్రశ్నకు.. సంజయ్ దత్ రియాక్ట్ అవుతూ.. రాజాసాబ్, దురంధర్ రెండు సినిమాల్లో నాది భిన్నమైన పాత్రలు. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర. ప్రేక్షకులు నా పాత్రను ఎంజాయ్ చేస్తారు.
కాబట్టే రాజా సాబ్, దురంధర్ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావొద్దని నేను కోరుకుంటున్నా. అలా ఒకే రోజు రిలీజ్ కావనే అనుకుంటున్నాను కూడా. ఎందుకంటే ఒక్కో సినిమాకు ఒక్కో జర్నీ ఉంటుంది.. అంటూ సంజయ్ దత్ రాజా సాబ్, దురంధర్ క్లాష్ పై స్పందించారు.