కంచె చిత్రంతో వెండితెరకు పరిచయమైన ప్రగ్య జైశ్వాల్ టాలీవుడ్ లో దశాబ్ధం కెరీర్ ని పూర్తి చేసుకుంటోంది. గడిచిన దశాబ్ధంలో ఈ అమ్మడు కెరీర్ గేమ్ ని ఛేంజ్ చేసేందుకు, స్టార్ డమ్ అందుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా ఇది అందరికీ అందని ద్రాక్ష. రష్మిక మందన్న, శ్రీలీల లాంటి రేర్ ట్యాలెంట్ కి మాత్రమే స్టార్ డమ్ అందుతుందని ప్రూవ్ అయింది. ఆ ఇద్దరితో పోలిస్తే ప్రగ్య జైశ్వాల్ ని మొదటి నుంచి దురదృష్టం వెంటాడింది.
ప్రస్తుతం ప్రగ్య జైశ్వాల్ టాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. వీటిలో టైసన్ నాయుడు, అఖండ 2 తనకు చాలా కీలకమైన చిత్రాలు. ముఖ్యంగా ఎన్బీకే సరసన నటిస్తున్న `అఖండ 2` తన కెరీర్‌కి గేమ్ ఛేంజర్ గా మారుతుందని ఆశిస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ లో విడుదలకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ప్రగ్య కనిపించనుందని సమాచారం.
మరోవైపు ప్రగ్య జైశ్వాల్ తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది. ఈ ఫోటోషూట్ లో ప్రగ్య అందమైన తెలుపు రంగు మోనోకినీలో టూ హా* గా కనిపిస్తోంది. ఒంపులు తిరిగిన అందమైన దేహశిరుల్ని, థై సొగసులను ఆవిష్కరిస్తున్న ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో యువతరాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.