ఒకప్పుడు అంటే జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తల్లో జబర్దస్త్ కి జెడ్జి గా పని చేసిన నాగబాబు కొన్నేళ్ల పాటు రోజా తో కలిసి జబర్దస్త్ ని నడిపించారు. నాగబాబు పొగిడితే ఆ కమెడియన్ లైఫ్ సెటిల్ అన్నట్లుగా ఉండేది అప్పట్లో అపరిస్థితి. అలా నాగబాబు కి చాలామంది కమెడియన్స్ విధేయులుగా మారిపోయారు.
ఆ తర్వాత నాగబాబు జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్-భరత్ కోసం జబర్దస్త్ ని వదిలేసి జీ తెలుగులో కనిపించడమే కాదు తనతో పాటే చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ ని బయటకి తెచ్చేసారు. కానీ అదిరింది కామెడీ షో జబర్దస్త్ లా పాపులర్ అవ్వలేదు. ఆతర్వాత నాగబాబు రాజకీయాల్లో బిజీ అవడము, జబర్దస్త్ ని నాగబాబు పూర్తిగా వదిలేసారు. కానీ ఇప్పుడు మరోమారు నాగబాబు జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ లో కనిపించడం అందరికి షాకిచ్చింది.
అంతేకాదు నాగబాబు తో పాటుగా ఒకప్పుడు జబర్దస్త్ లో ఫేమస్ అయిన వేణు, చమ్మక్ చంద్ర, ధనరాజ్ ఇలా టాప్ కమెడియన్స్ అందరూ కనిపించడం ఆశ్చర్యంగా మారింది. నాగబాబు జెడ్జి స్థానంలో కూర్చోవడంతో జబర్దస్త్ కి కళ వచ్చింది. తాజాగా వదిలిన ప్రోమో చివరిలో అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే అంటూ హైప్ క్రియేట్ చేసారు.
కావాల్సిన వాడు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంట్రా కుయ్యా.. మనల్ని ఎవడ్రా ఆపేదిఅంటూ చెప్పిన డైలాగ్ చూసి నాగబాబు జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చారా లేదంటే స్పెషల్ ఎపిసోడ్ కోసం వచ్చారా అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.