అక్కినేని పెద్ద కోడలిగా డిసెంబర్ 5 న నాగ చైతన్య ను వివాహం చేసుకుని నాగార్జున ఇంట అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా వుంది. ఆమె నటించిన భీమా జ్యువెలర్స్ కొత్త యాడ్ వైరలవుతుంది. ఇక పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్య తో కలిసి వీలున్నప్పుడు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది.
రీసెంట్ గా తమిళనాడు లో కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేసిన శోబితకు పురాతన ఆలయాలన్నా తన తల్లి చీరలన్నా చాలా ఇష్టమట. అందుకే అప్పుడపుడు తన తల్లి చీరకు కట్టుకుని ఫోటో షూట్స్ చేయించుకుంటాను అని చెప్పిన శోభిత తాజాగా వదిలిన చీరకట్టు పిక్స్ ట్రెండ్ అవుతున్నారు.
చీర లో అద్భుతంగా, కుందనపు బొమ్మలా కనిపిస్తున్న శోభిత ఫొటోస్ తో పాటుగా సంధ్య వందనం అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం శోభిత అక్కినేని సంధ్య వందనం ఫొటోస్ మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారాయి.