రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం SSMB 29(వర్కింగ్ టైటిల్) షూటింగ్ కి ప్రస్తుతం చిన్నపాటి బ్రేక్ వచ్చింది.. కారణం రాజమౌళి పెదనాన్న శివశక్తి దత్తా గారు పరమపదించడంతో రాజమౌళి షూటింగ్ కి బ్రేకిచ్చారు. మరోపక్క రాజమౌళి అండ్ టీమ్ కి మరో బిగ్ షాక్ తగిలినట్లుగా వార్తలొస్తున్నాయి.
అదేమిటంటే ఈ నెల చివరి వారంలో రాజమౌళి-మహేష్, కీలక పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కెన్యాకు వెళ్లాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది అనే వార్త మహేష్ అభిమానులను డిజప్పాయింట్ చేసింది. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్‌ను కెన్యా దేశంలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆయన పూర్తి చేసుకున్నారు.
కానీ ఇప్పుడు కెన్యా దేశంలో అంతర్గత కలహాలతో అక్కడి పరిస్థితులు సరిగా లేవని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయడం కష్టమని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్. ఈ షెడ్యూల్ ని అన్ని రకాల లొకేషన్స్ చెక్ చేసి ఫైనల్ చేసాక ఇలా జరగడంపై యూనిట్ అయోమయంలో ఉంది అంటున్నారు.