పదే పదే విడుదల తేదీలను ను మార్చుకుంటూ ఫైనల్ గా థియేటర్స్ లోకి రాబోతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పాన్ ఇండియా మూవీ అంటూ మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వచ్చారు. జులై 31 న కింగ్ డమ్ విడుదల అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. గతంలో లైగర్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారాలనుకుంటే ఆ సినిమా షాకిచ్చింది.
ఆ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తాజాగా కింగ్ డమ్ కూడా హిందీలో విడుదల కాబోవడం లేదు. కింగ్ డమ్ ని తెలుగు, తమిళంలో మాత్రమే జులై 31 న విడుదల చేస్తున్నారు. హిందీలో మాత్రం కింగ్ డమ్ ఓటీటీ నుంచే స్ట్రీమింగ్ లోకి రాబోతుంది.
ఇది నిజంగా షాకింగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. దీనికి కారణం కింగ్ డమ్ విడుదల లేట్ అవడంతోనే నెట్ ఫ్లిక్స్ ఈ మెలిక పెట్టినట్లుగా తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ తో జరిగిన చర్చలు మూలంగానే కింగ్ డమ్ హిందీ వెర్షన్ విషయంలో ఈ టర్న్ తీసుకోవాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది.
సో ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కాదు విజయ్ దేవరకొండ కే బిగ్ షాక్ అని చెప్పాలి. కింగ్ డమ్ తో అయినా ఫ్యాన్ ఇండియా స్టార్ అవుదామనుకుంటే అది ఇలా హ్యాండ్ ఇచ్చింది.