రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో క్రూరుడైన అబ్రార్ హక్ పాత్రలో అద్భుతంగా అభినయించాడు బాబి డియోల్. నరహత్యలు, భార్యలపైనే అత్యాచారం చేసే ఆవేశపరుడిగా అతడిని చూపించాడు సందీప్ వంగా. అబ్రార్ పాత్ర బాబి డియోల్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. అంతేకాదు.. అది అతడి నటనా కెరీర్ కి పునరుజ్జీవనం అయింది. డియోల్ కుటుంబంలో ఎంతో ఆనందం నింపిన అవకాశమిది.
అయితే ఇప్పుడు మరోసారి రణబీర్ సినిమాలోనే అతడు నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. రణబీర్ కపూర్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ `రామాయణం` చిత్రంలో బాబి డియోల్ కుంభకర్ణుడిగా నటిస్తాడని వెబ్ లో కొంతకాలంగా గుసగుస వినిపిస్తోంది. అయితే దర్శకుడు నితీష్ తివారీ కానీ, నిర్మాతలైన నమిత్ మల్హోత్రా- యష్ వీళ్లలో ఎవరూ అతడిని ధృవీకరించలేదు.
అయితే `యానిమల్`లో రణ్ విజయ్ వర్సెస్ అబ్రార్ హక్ ఫేసాఫ్ గొప్పగా వర్కవుట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడి సైన్యంతో పోరాడే రాక్షస రాజు కుంభకర్ణుడిగా బాబి కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాబి భీకర రూపం ఇప్పటికే అభిమానుల్లో రిజిస్టర్ అయి ఉంది కాబట్టి అతడు ఈ పాత్రకు సరిపోతాడని భావిస్తున్నారు. కానీ ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. బాబి డియోల్ ని కుంభకర్ణుడి పాత్రకు ఎంపిక చేసినట్టు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇక బాబి ప్రస్తుతం హరి హర వీరమల్లు, జననాయగన్ సహా పలు భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు.