ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి, పాటల రచయిత శివశక్తి దత్తా(92) గత రాత్రి కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, RRR, హనుమాన్ సినిమాలకు ఆయన పాటలు రాశారు. కొన్ని చిత్రాలకు స్క్రీన్ రైటర్ గానూ పని చేశారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు. నాగార్జున నటించిన జానకిరాముడు చిత్రానికి రచయితగా పనిచేసిన శివశక్తి దత్త. చంద్రహాస్ సినిమాకి డైరెక్టర్ గాను పనిచేసారు. శివశక్తి దత్తా మరణంతో సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కీరవాణి కుటుంబ సబ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.