ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు జులై 24 న విడుదల అంటూ మేకర్స్ సెలవిచ్చారు. పలుమార్లు వీరమల్లు విడుదల తేదీని వాయిదా వేస్తూ వేస్తూ చివరికి జులై 24 న ఫైనల్ చేశారు. ఇక మొదటి నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్ డమ్ కి హరి హర వీరమల్లు అడ్డుపడుతుంది అనుకున్నారు.
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిలిం కింగ్ డమ్ కూడా అనేకసార్లు విడుదల వాయిదా వేసుకుంటూ వచ్చింది. జులై 4 న విడుదల అవ్వాల్సిన కింగ్ డమ్ పోస్ట్ పోన్ అయ్యి కామ్ అయ్యింది. దానితో దేవరకొండ అభిమానులు నిర్మాత నాగవంశీ పై ప్రెజర్ తెస్తున్నారు.
తాజాగా కింగ్ డమ్ విడుదల తేదీని ఓ వీడియో తో ప్రకటించారు మేకర్స్. హరి హర వీరమల్లు వచ్చాక ఒక్క వారం గ్యాప్ లో అంటే వీరమల్లు జులై 24 విడుదలవుతుంటే కింగ్ డమ్ ను జులై 31 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి అమెజాన్ ప్రైమ్ ఒత్తిడితో హరి హార వీరమల్లు డేట్ లాక్ అయితే, నెట్ ఫ్లిక్స్ ఒత్తిడితో కింగ్ డమ్ డేట్ లాకయ్యింది.