Advertisement
Google Ads BL

ట్యాలెంటెడ్ హీరోపై భారీ కుట్ర‌?


సినీప‌రిశ్ర‌మ‌ల్లో న‌ట‌వార‌స‌త్వం, ఔట్ సైడ‌ర్స్ పై కుట్ర‌ల గురించి ఇటీవ‌ల ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌ర‌హా చ‌ర్చ బాలీవుడ్ లో మ‌రీ ఎక్కువ‌. ప్ర‌ముఖ నేప‌థ్య గాయకుడు- సంగీత దర్శకుడు అమల్ మాలిక్ ఇటీవల ఒక సంచ‌ల‌న‌ ప్రకటనతో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అత‌డు ప‌రిశ్ర‌మ కుట్ర‌ల గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ఔట్ సైడర్స్ పై ఎలాంటి కుట్ర జ‌రుగుతుందో వెల్ల‌డించాడు.

Advertisement
CJ Advs

సినీ పరిశ్రమ సుశాంత్ సింగ్ త‌ర‌హాలోనే  స‌క్సెస్ ఫుల్ హీరో, ప్ర‌తిభావంతుడైన‌ కార్తీక్ ఆర్యన్‌ను ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పెద్ద నిర్మాతలు, తారలు అత‌డిని పరిశ్రమ నుండి బయటకు గెంటేయ‌డానికి  ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశారని అమల్ వెల్ల‌డించారు.

తాజా ఇంటర్వ్యూలో అమల్ మాట్లాడుతూ, ఈ పరిశ్రమ వాస్తవికతను ప్రజలు అర్థం చేసుకున్నారు.

ఇది చాలా చీకటి ప్ర‌పంచం.. కొంద‌రు ప్ర‌తిభావంతులు తమ ప్రాణాలను కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ త‌న‌పై కుట్ర‌ల్ని భరించలేకపోయాడు. అతడికి ఏం జరిగిందో కానీ.. కొందరు దీనిని హత్యగా, మరికొందరు దీనిని ఆత్మహత్యగా భావించారు. చివరికి అత‌డు అంత‌ర్ధాన‌మ‌య్యాడు.. ఇది ప‌రిశ్ర‌మ‌లో స‌రైన‌దేనా? అని ప్ర‌శ్నించాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఇంకా మాట్లాడుతూ ...అతడి చుట్టూ ఉన్నవారు అతడిని నిరాశపరిచారు. ఈ పరిశ్రమ తీరే అలాంటిది. ఇవన్నీ వెలుగులోకి వచ్చాక సామాన్యప్ర‌జ‌లు బాలీవుడ్ వ్య‌తిరేకులుగా మారారు అని అన్నారు. కార్తీక్ ఆర్యన్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరిగానే దూరంగా ఉంచుతున్నారని, కుట్ర చేస్తున్నార‌ని అత‌డు వాదించారు.  

ఒక మంచి మనిషికి అన్యాయం జరిగింది. ఈ రోజు కార్తీక్‌కి అన్యాయం జ‌రుగుతోంది. అతడు కూడా అదే పనికి(సుశాంత్ లా ఆత్మ‌హ‌త్యకు) ప్రయత్నించడాన్ని ప్ర‌త్యక్షంగా మీరు చూస్తారేమో!  సమస్యలు ఉన్నప్పటికీ అతడు వాటిని ఎదుర్కొంటూ, నవ్వుతూ ముందుకు సాగుతున్నాడ‌ని వ్యాఖ్యానించాడు. తల్లిదండ్రులు అత‌డి వెనుక దృఢంగా నిలబడి మద్దతునిచ్చారు.. మార్గనిర్దేశం చేస్తున్నారు.

 అతడు కూడా ప‌రిశ్ర‌మ‌కు కొత్తవాడే.. తనని తాను నిరూపించుకున్నాడు. అయినా కానీ డజన్ల కొద్దీ పెద్ద మ‌నుషులు అతడిని ప‌రిశ్ర‌మ‌ బయటకు గెంటేయ‌డానికి ప్రయత్నిస్తున్నారు. పవర్ ప్లేతో కుట్ర చేస్తున్నారు. పెద్ద నిర్మాతలు, నటులు కూడా ఇందులో భాగం అని వ్యాఖ్యానించాడు. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డిలానే కార్తీక్ ఆర్య‌న్ చేస్తాడేమో! అనే సందేహాన్ని అత‌డు వ్య‌క్తం చేసాడు.

Amaal Mallik says Bollywood is targeting Kartik Aaryan:

Amaal Mallik says Bollywood is targeting Kartik Aaryan like Sushant Singh Rajpu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs