Advertisement
Google Ads BL

నేడు విచారణకు సూపర్ స్టార్


సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం విచారణకు హాజరవ్వాల్సిందిగా రంగారెడ్డి వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందున ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి ప్లాట్స్ కొన్న కస్టమర్స్ సాయి సూర్య డెవెలపర్స్ వారు తమను ప్లాట్స్ విషయంలో మోసం చేసారు అంటూ కేసు వెయ్యగా అందులో భాగస్వామిగా ఉన్న మహేష్ కు కూడా నోటీసులు అందాయి. 

Advertisement
CJ Advs

ఈ కేసులో మహేష్ A 3 గా ఉన్నారు. మహేశ్‌బాబు ఫొటోలను ఉపయోగించి బ్రోచర్లను పంపిణీ చేశారు. ఈ వెంచర్‌లో అన్ని అనుమతులున్నాయని పేర్కొంటూ కస్టమర్స్ ను సదరు సంస్థ ఆకర్షించింది. మహేశ్ మీద నమ్మకంతో ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి ఒక్కో ప్లాట్‌ కోసం రూ.34.80 లక్షలు చొప్పున చెల్లించగా.. ఆ ప్లాట్లకు సంబంధించి లేఅవుట్‌ లేదని తాము తర్వాత తెలుసుకున్నామని వారు కేసు వేశారు. 

సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ, యజమాని కంచర్ల సతీశ్‌ చంద్రగుప్త తో పాటుగా ఈ కేసులో A3గా ఉన్న మహేష్ బాబు ని కూడా విచారణకు హాజరుకావాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Mahesh Babu Gets Consumer Commission Notice:

Mahesh Babu gets Fresh Notices
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs