ఇప్పటికే రాజా సాబ్ ఏప్రిల్ లో పోస్ట్ పోన్ అయ్యి ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు కొత్త డేట్ లాక్ చేసారు మేకర్స్. డిసెంబర్ 5 న పాన్ ఇండియా మూవీ గా రాజా సాబ్ విడుదల అంటూ ప్రకటించారు, ఇప్పుడు మరోసారి డిసెంబర్ 5 నుంచి కూడా రాజా సాబ్ పోస్ట్ పోన్ అవుతుందా అనే అనుమానాలను కలిగించింది బాలీవుడ్ మూవీ ఒకటి.
రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రాన్ని డిసెంబర్ 5 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి రాజా సాబ్ మేకర్స్ నుంచి క్లారిటీ తీసుకున్నాకే దురంధర్ చిత్ర విడుదల తేదీని ప్రకటించారా అనే అనుమానాన్ని సోషల్ మీడియాలో నాటారు కొందరు. నార్త్ లో ప్రభాస్ బాహుబలి, సాహో చిత్రాలతో బలమైన ముద్ర వేశారు.
ప్రభాస్ డిసెంబర్ 5 న రాజా సాబ్ తో వస్తుంటే రణ్వీర్ సింగ్ దురంధర్ తో పనిగట్టుకుని రారు. మరి రాజా సాబ్ పోస్ట్ పోన్ అయితేనే రణవీర్ ఆ డేట్ కి లాక్ చేసి ఉంటారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు కాగానే ప్రభాస్ అభిమానులు మళ్లీ డిజప్పాయింట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు.