గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన లక్కీ భాస్కర్ 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవడంతో థియేటర్స్ లోనే కాదు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లోను అద్భుతమైన హిట్ అందుకుంది.
చిన్న బ్యాంకు ఎంప్లొయ్ ప్రమోషన్ ఆసించి భంగపడి ఫ్యామిలీ స్థితిగతులలో తెలివి తేటలతో బ్యాంకునే మోసం చేసి ఆ మోసాన్ని కూడా తెలివిగా క్యాష్ చేసుకుంటూ.. ఆడియన్స్ మనసులో హీరో దీనావస్థ నుంచి తప్పు చేసినా యాక్సెప్ట్ చేసేలా వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ ను డిజైన్ చేసారు.
ఇప్పుడు లక్కీ భాస్కర్ కి సీక్వెల్ చేస్తున్నట్టుగా వెంకీ అట్లూరి ప్రకటించారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్య తో సినిమా చేస్తున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ లక్కీ భాస్కర్ 2 ఉంటుంది అని చెప్పారు. సో సూర్య తో మూవీ తర్వాత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సీక్వెల్ పై కూర్చుంటారేమో చూడాలి.